దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏడో రోజైన మంగళవారం ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దుర్గమ్మ భక్తులకు శ్రీమహాలక్ష్మీదేవిగా దర్శనం ఇచ్చారు.
అనేక మంది మహిళలు.. చిన్న పిల్లలు సహా వేలాది మంది అయ్యప్ప భక్తులు సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కేరళ రాజధాని తిరువనంతపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీదుర్గామలేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఆరవ రోజైన సోమవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం, అష్టాదశ మహాశక్తి పీఠం కలసి వెలసిన శ్రీశైలంలో శ్రీ దేవీ నవరా త్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
దసరా శరన్నవరాత్రులకు పశ్చిమబెంగాల్ పెట్టింది పేరు. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగరంలో ఒక మండపం ఏర్పాటుకు ఏకంగా 4వేల కిలోల పసుపును ఉపయోగించారు.
తిరమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన ఆదివారం రాత్రి.. మలయప్ప స్వామి తనకు అత్యంత ప్రియమైన గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
సత్యనారాయణ వ్రతం అనగానే గుర్తుకొచ్చే క్షేత్రం.. అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయం.
జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఐదో రోజు ఘనంగా జరిగాయి. ఆదివారం స్కందమాతగా అమ్మవారు దర్శనమివ్వగా, ఆదిదంపతులైన శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై విహరించారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు నాలుగో రోజు కూష్మాండదుర్గ స్వరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
లోకానికి శాంతిని చేకూర్చే తల్లి లలితాదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను భక్తులు దర్శించుకున్నారు.


Related News