ముంబయిలో విలువైన కమర్షియల్ ప్రాపర్టీ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బి.కె.సి)లో ఈక్వినాక్స్ బిజినెస్ పార్క్స్‌ని రూ. 2,400 కోట్లకి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కి ఎస్సార్ గ్రూప్ విక్రయించింది.
ఎనర్జీ కంపెనీల షేర్ల ముమ్మర కొనుగోళ్ళు స్టాక్ మార్కెట్ సూచీలను మంగళవారం వరుసగా రెండవ రోజు అధిక స్థాయిల్లో ముగిసేట్లు చేశాయి.
దివాలా పరిష్కార వ్యవస్థలో ‘ప్రి-ప్యాక్‌ల’ భావనను ఆవిష్కరిస్తే భారతదేశానికి మేలు జరగగలదని జాతీయ కంపెనీలా ట్రైబ్యునల్ అధ్యక్షుడు ఎం.ఎం. కుమార్ అభిప్రాయపడ్డారు.
చెరకు రైతులకు షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు తడిసి మోపడైన సమయంలో చెరకు రైతులను ఆదుకునే వివిధ మార్గాలను కేంద్రం పరిశీలిస్తోంది.
వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. పిల్లల స్కూళ్ళకు సెలవులు కావడంతో స్నేహితులతో సరదాగా గడిపేస్తూంటారు.
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ నేవల్ అండ్ ఇంజనీరింగ్ ఒక సంస్థగా కొనసాగుతూ లాభాలు పాదించడంపై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేయడంతో ఆ కంపెనీ షేర్ ధర దాదాపు 9 శాతం క్షీణించి రూ. 24.5 అత్యల్ప స్థాయికి పడిపోయింది.
టాటా గ్రూప్ కంపెనీలన్నింటికీ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్  గ్లోబల్  కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ అధ్యక్షుడుగా మాజీ విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్‌ను తీసుకొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
విదేశాల నుంచి జరిగే చెల్లింపుల్లో భారతదేశం మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. విదేల్లోని భారతీయ సంతతివారు మాతృ దేశంలోని వారికి చేసిన జమలు 2017లో సుమారు 69 బిలియన్ అవెురికన్ డాలర్ల మేరకు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ సోమవారం వెల్లడించింది.
సుమారు రూ. 195 కోట్లను రాబట్టుకునేందుకు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్‌కి, గీతాంజలి ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌లకు కెనరా బ్యాంకు తాఖీదులు జారీ చేసింది.

Related News