జనసేన సభలో అపశ్రుతి

Updated By ManamWed, 03/14/2018 - 17:10
JanaSena Party Formation Day Maha Sabha

10 injured in janasena

గుంటూరు: జనసేన ఆవిర్భావ ప్రారంభానికి మునుపే అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా కార్యకర్తలుగా ఒక్కసారిగా రావడంతో సభలో తొక్కిసలాట జరిగింది. సభ వద్ద ఉన్న బ్యారికేడ్లను కార్యకర్తలు, అభిమానులు ధ్వంసం చేశారు. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వెనుకనున్న కార్యకర్తలు ముందు గ్యాలరీలోకి రావాలని చెప్పి యువత తోపులాట జరిగింది. 

అదికాస్త తొక్కిసలాటకు దారితీయడంతో పదిమంది కార్యకర్తలు స్పృహ తప్పి పడిపోయారు. కాగా పలువురు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. కాగా వీరిలో ఇద్దరు కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మొదట్నుంచి పోలీసు బందోబస్తు తక్కువగా ఉండటంతో జనసేన వాలంటర్లు, బౌన్సర్లను ఏర్పాటు చేసుకుంది. ఉదయమే జనసేన సభకోసం వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు.  మీడియా వాహనాలపైకి సైతం కార్యకర్తలు ఎక్కేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో వారిని దింపడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కాగా అంతకమునుపే పోలసులు కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసిన సంగతి తెలిసిందే.

police, Activists injured in janasena Sabha

English Title
10 activists Hospitalized In JanaSena Party Formation Day Maha Sabha
Related News