లోయలో పడ్డ బస్సు, 10మంది మృతి

Updated By ManamThu, 07/19/2018 - 11:34
bus accident

bus accident సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్- గంగోత్రి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. సుమారు 250మీటర్ల లోతులో ఈ బస్సు పడ్డట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 25మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లను రప్పించింది. మరణించివారి కుటుంబసభ్యులకు 2లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డ వారికి 50వేలు ఇవ్వనున్నారు. ఘటనా స్థలానికి చేసుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

English Title
10 dead after bus fall into gorge
Related News