11 మంది బాలికలకు వీడిన చెర

Updated By ManamTue, 07/31/2018 - 23:19
kishan reddy
  • యాదాద్రిలో మరో వ్యభిచార కూపం

  • పోలీసుల అదుపులో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా 

kishanయాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో వ్యభిచార కూపం నుండి 11 మంది బాలికలకు యాదాద్రి పోలీసులు విముక్తి కల్పించారు. మంగళవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ యాదాద్రి డిసిపి రాంచంద్రా రెడ్డి, ఎసిపి శ్రీనివాసాచార్యులు  సిఐలు అశోక్ కుమార్, ఆంజనేయులు తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట గణేష్ నగర్‌లో వ్యభిచారం నిర్వహించే ముఠాకు చెందిన కొందరు  కొంత మంది బాలికలను అక్రమంగా ఎత్తుకొచ్చి, లేదా  లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వ్యభిచార కూపంలో వారిని బందీగా ఉంచినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో యాదగిరిగుట్ట పోలీసులు, ఎస్‌ఓటి పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు, షీ టీము పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలోని పలు వ్యభిచార గృహాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా 11 మంది బాలికలు బందీలుగా ఉన్నట్లు గుర్తించి, వారిని పోలీసులు, అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బాలికలను అక్రమంగా బందీలుగా ఉంచిన 8 మందిని అరెస్టు చేశారు. ఇక ఈ ముఠా సభ్యులు పలు చోట్ల నుండి అక్రమంగా బాలికలను ఎత్తుకురావడం, లేదా లక్షల రూపాయలు వెచ్చించి బాలికలను కొనుగోలు చేస్తారని సిపి భగవత్ తెలిపారు . ఆ తర్వాత వారిని తమ వ్యభిచార కూపాలకు తీసుకువచ్చి బందీలుగా ఉంచుతారు. బాలికలు త్వరగా ఎదిగేందుకు ప్రత్యేకంగా ఇంజెక్షన్లు ఇస్తారు. బాలికల్లో కొంత ఎదుగుదల వచ్చాక వారిని వ్యభిచార కూపంలోకి దించుతారు. ఇలా ఈ ముఠా వ్యవహరిస్తుందని సిపి మహేష్ భగవత్ వివరించారు.

English Title
11 captive girls
Related News