విమానంలో తీవ్ర అస్వస్థత, చిన్నారి మృతి

Updated By ManamWed, 09/26/2018 - 12:35
 Arnav Varma dies breathing troubles
 Arnav Varma dies

హైదరాబాద్ : దోహ నుంచి హైదరాబాద్ వస్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్  విమానంలో వచ్చిన ఓ 11 నెలల చిన్నారి బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మౌలాలికి చెందిన అనిల్‌ వర్మ... భార్య, కుమారుడు ఆర్నావ్ వర్మతో కలిసి అమెరికా నుంచి దోహా మీదుగా హైదరాబాద్ వస్తుండగా... చిన్నారికి శ్వాస అందక పోవడంతో హుటాహుటీన అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆర్నావ్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

English Title
11 Month Old Baby Boy Dies On Qatar Airways Flight To Hyderabad
Related News