కాట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల గౌరవ వేతనం

Updated By ManamThu, 09/06/2018 - 00:31
kadiyam
  • కాలేజీల్లో మధ్యాహ్న భోజనం ఈ నెల నుంచే అమలు

  • ఉపాధ్యాయులకు నగదు ప్రోత్సాహకం పెంపు

  • విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

  • ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

  • ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత

kadiyamహైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల నుంచే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనాలు 12 నెలల పాటు ఇచ్చేందుకు కూడా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదాన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 10వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందని పేర్కొన్నారు. సన్నబియ్యంతో పేద విద్యార్థుల కడుపు నింపుతున్న ఈ పథకాన్ని తమకు కూడా వర్తింపజేయాలని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు, అధ్యాపకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరాయన్నారు. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై తన నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలతో కమిటీ వేశారని చెప్పారు. ఈ కమిటీ మధ్యాహ్న భోజనాన్ని కాలేజీలల్లోని విద్యార్థులకు కూడా అమలు చేయాలని ప్రతిపాదించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించార ని పేర్కొన్నారు. ఈ నెల నుంచే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుందని కడియం శ్రీహరి వెల్లడించారు. ఇది అమలైతే దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని వివరించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు గౌరవ వేతనంతో జూనియర్ కాలేజీల్లో 3728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు మొత్తంగా 5059 మంది లబ్ది పొందనున్నాని చెప్పారు. 

విద్యావ్యవస్థ పటిష్టానికి నాలుగేండ్లుగా కృషి..
బడుగు, బలహీన వర్గాలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 611 గురుకుల విద్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు నాలుగేళ్లుగా చేసిన కృష ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారన్నారు. తొలిసారిగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారన్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యాలయాలపై నమ్మకం పెరగడమే దీనికి నిదర్శనమన్నారు.  ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఆమోదానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు.

ఉపాధ్యాయులే కీలకం..
ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. గురుకుల విద్యాలయాల్లో వారానికి ఆరుసార్లు మాంసాహారం, పాలు, రాగిమాల్ట్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంలో 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి పౌష్టికాహార భోజనం పెడుతున్నామన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో ఉపాధ్యాయులే కీలకమని, మరింత నిబద్ధతతో పనిచేయాలని కోరారు.కోరారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే నగదు ప్రోత్సాహాకాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి పెంచే ఆలోచన ఉన్నట్లు మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. 

English Title
12 months of honorary wage for catwalk lecturers
Related News