లోయలో పడ్డ జీపు: 13 మంది దుర్మరణం

Updated By ManamSat, 09/22/2018 - 15:59
13 dead after jeep falls into gorge in Shimla

jeep fall, gorge, Shimla district, Omapati Jamwal, jeep skidded offసిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జీపు లోతైన లోయలో పడి 13 మంది మృత్యువాత పడ్డారు. సవారా నుంచి తియునీ మీదుగా వెళ్తున్న ట్రెక్స్ జీపు సనాయిల్ వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో జీపులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందినట్టు సిమ్లా ఎస్పీ ఒమపాటి జమ్వాల్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఆయన తెలిపారు.

మృతుల్లో ఎనిమిది మంది మూడు కుటుంబాలకు చెందినవారు కాగా, వారిలో ముగ్గురు దంపతులు ఉన్నారు. మృతిచెందిన ప్రయాణికుల్లో మత్వార్ సింగ్ (48), అతని భార్య బస్వంతి దేవి (44), కుమారుడు మునీశ్ (24), ప్రేమ్ సింగ్ (38), అతని భార్య పూనమ్ (30), కుమార్తె రుధిమా (6), అత్తర్ సింగ్ (44), అతని భార్య మున్నా దేవి (40), బిట్టు (42), బండి దేవి (48), నీర్ సింగ్ (35), మనోజ్ (35), అనిల్ (28)గా పోలీసులు గుర్తించారు. 

English Title
13 dead after jeep falls into gorge in Shimla
Related News