మహిళ కంట్లో 14 పురుగులు

Updated By ManamTue, 02/13/2018 - 21:59
eye
  • అర అంగుళం సైజు క్రిములు

  • ఎడమ కంట్లో వెలికి తీసిన వైద్యులు

  • ఒరెగాన్ మహిళకు వింతవ్యాధి

eyeన్యూయార్క్: కంట్లో చిన్న నలుసు పడితేనే మంటతో గగ్గోలు పెడుతుంటాం.. అలాంటిది కంట్లో పదుల సంఖ్యలో పురుగులు కాపురం పెడితే? అరంగుళం సైజులో పూర్తి పారదర్శకంగా ఉన్న పురగులు ఒక్కోటిగా బయటపడుతుంటే కలిగే గగుర్పాటు చెప్పక్కర్లేదు. అమెరికాలోని సముద్ర తీర పట్టణం ఒరెగాన్‌లో ఓ మహిళకు ఈ వింత పరిస్థితి ఎదురైంది. అత్యంత అరుదైన వ్యాధి కారణంగా అమె ఎడమ కంట్లోంచి పురుగులు బయటపడ్డాయి. జంతువులలో మాత్రమే కనిపించే ఈ అరుదైన వ్యాధిని పారసైటిక్ ఇన్‌ఫెక్షన్‌గా వ్యవహరిస్తారట. దీని కారణంగా బాధితురాలి కంట్లోంచి ఏకంగా 14 పురుగులను వైద్యులు బయటికి తీశారు. సాధారణంగా పశువులలో మాత్రమే.. అదీ అరుదుగానే కనిపించే ఈ వ్యాధి ఈగల వల్ల వ్యాపిస్తుందని చెప్పారు. 2016 ఆగస్టులో జరిగిన ఈ ఘటనపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తాజాగా ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. అమెరికా ఉత్తర ప్రాంతంలో పసిఫిక్ తీరాన ఉన్న ఒరెగాన్ సిటీలో వైద్యులు ఈ కేసును గుర్తించారు. అబ్బి బెక్లే అనే 26 ఏళ్ల మహిళకు ఒకరోజు కన్ను దురదగా ఉండడంతో నలుముకోగా ఓ చిన్న పురుగు బయటపడింది! సుమారు అంగుళంలో సగం ఉన్న ఈ పురుగును చూసి బెక్లే ఆందోళన చెందింది. ఎడమ కన్నును మరోసారి నలుముకోగా మరో పురుగు బయటపడింది. ఇలా చాలా మటుకు పురుగులన్నీ తనే తీసేసుకుంది. ఆనక వైద్యుడిని సంప్రదించగా.. వారు మరో 14 పురుగులను బయటికి తీశారు. బెక్లే థెలజియా గులోసా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. అత్యంత అరుదైన ఈ వ్యాధి గతంలో మరో ఇద్దరిలోనూ గుర్తించినా ఇలా వారి కంట్లో నుంచి పురుగులు బయటపడలేదని వైద్య నిపుణులు తెలిపారు. ఫేస్ ఫ్లైస్‌గా వ్యవహరించే ఈగల వల్ల ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుందన్నారు. ఈ ఈగలు ఇతర జీవుల కన్నీటితో కడుపు నింపుకుంటాయట. ఈ ఈగలు పశువుల కన్నీటిని పీల్చే ప్రయత్నంలో కండ్లపై వాలినపుడు ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతుందని వివరించారు.


మనుషుల్లో ఇదే తొలిసారి..
సముద్ర తీర ప్రాంతం కావడంతో ఒరెగాన్‌లో ఎక్కువగా పశువులు, ఇతర జంతువుల పెంపకం ఎక్కువ. బెక్లే కూడా సొంతంగా ఓ గుర్రపుశాలను నిర్వహిస్తోంది. తరచుగా అక్కడే గడపాల్సి రావడంతో పాటు అప్పుడప్పుడు గుర్రపు స్వారీ చేస్తుండడంతో ఈ అరుదైన వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, పశువులలో సాధారణంగా కనిపించే ఈ వ్యాధి మనుషులకు సోకడం ఇదే తొలిసారి అని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 

Tags
English Title
14 worms in woman's cunt
Related News