ఏడాదిలో వర్షాలకు 1400 మంది బలి

Updated By ManamMon, 09/03/2018 - 22:56
Flood in Kerala
  • కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడి

allahabadన్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తం గా వివిధ ప్రమాదాలు, ఘటన ల్లో 1,400 మంది మృతి చెందారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో అత్యధికంగా కేరళ వరదల్లో 488 మంది దుర్మరణం పాలయ్యారని తెలిపింది. పది రాష్ట్రాల్లో ప్రమాద ఘటనలు ఎక్కువగా జరిగాయని పేర్కొంది.  కేరళలోని 14 జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా చూపిందని, 54.11 లక్షల మందిపై ఏదో రకంగా ప్రభావం పడిందని తెలిపింది. దాదాపు 14.52 లక్షల మంది నిరాశ్రయులయ్యారని, వారంతా ఇంకా పునరా వాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని వెల్లడించింది. ఈ రాష్ట్రంలో 57,024 హెక్టార్లలో పంట నష్టం సంభవిం చిందని పేర్కొంది. 

జలపాతం..మహోగ్రరూపం!
గలగలా దుంకుతున్న జలపాతం అందాలను చూస్తూ తన్మయత్వంలో ఉండగా.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఎవరో బకెట్లతో నీళ్లను కుమ్మరించినట్లుగా మహోగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా దుమికి దుమికి పడింది. ఆ సమయంలో అక్కడ 180 మంది వరకు పర్యాటకులు ఉన్నారు.  ఉత్తరాఖండ్ ముస్సోరిలోని కెంప్టీ వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. జోరున కురిసిన వర్షాలకు జలపాతంలో నీటి ఉధృతి పెరిగి..కొండలను చీల్చుకుంటూ నీరు కిందకు వచ్చింది. జలపాతం హోరు కు ఒక్కసారిగా భయభ్రాం తులకు గురై పరుగులు తీశారు. అనేక మంది నీళ్లలో చిక్కుకుపోయారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.

కేరళలో ర్యాట్ ఫీవర్ విజృంభణ
కేరళలో వరదల అనంతరం అంటువ్యాధుల విజృంభించే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందినట్లుగానే జరుగుతోంది. నీటి ఆధారంగా వచ్చే ర్యాట్ ఫీవర్‌లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మరో 350 మంది ఆ వ్యాధి లక్షణాలతో చికిత్స చేయించుకున్నారని, మరో 150 మందికి ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కోజికోడ్, ములప్పురం జిల్లాల్లోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉందని, నివారణకు అన్ని చర్యలు తీసుకంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. వైద్యాధికారులతో పాటు పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ ర్యాట్ ఫీవర్‌కు సంబంధించి మందులను అన్ని ఆరోగ్య శిబిరాల్లో ఉంచామని చెప్పారు.

English Title
1400 people are sacrificed for rains a year
Related News