సాహస బాలలకు వీర వందనం

Updated By ManamFri, 01/26/2018 - 13:34
national bravery awards

Bravery awardsఢిల్లీ రాజ్‌పథ్‌ వద్ద నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్‌లో సాహస బాలలను చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే బాలలకు ప్రతియేటా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్రేవరీ అవార్డులను ప్రదానం చేస్తోంది . ఈ ఏడాది 18 మంది బాలబాలికలు జాతీయ బ్రేవరీ అవార్డుకు ఎంపికయ్యారు. బ్రేవరీ అవార్డుకు ఎంపికైన వీరిలో ముగ్గురు బాలలు ఇప్పుడు ప్రాణాలతో లేరు.

ఇప్పటికే వీరిని అభినందించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ...వారికి పతకాలు అందజేశారు. వీరు రాథ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వీరికి మనం కూడా వీర వందనాలు చెబుదాం రండి...

English Title
18 children have been selected for National Bravery Awards
Related News