మైనస్ 30 డిగ్రీల వద్ద ‘జైహింద్’

Updated By ManamFri, 01/26/2018 - 16:03
ITBP
ITBP

దేశ రక్షణ కోసం ఎంతటి సాహసాలకైనా సిద్ధమని రిపబ్లిక్ డే రోజున భారత సేనలు మరోసారి చాటాయి. దట్టమైన మంచుతో కప్పేసిన హిమాలయ పర్వతాల్లో ఇండో-టిబెటిన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ)‌కి చెందిన జవాన్లు మార్చ్ చేశారు. 18 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న జవాన్లు...మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా చేసిన ఈ సాహసాన్ని కెమరాలో చిత్రీకరించి...సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన ఐటీబీపీ జవాన్లకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. వారి దేశభక్తికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నారు. 

Read Related Article: సాహస బాలలకు వీర వందనం

Read Related Articles: వీరనారీమణుల వీరోచిత విన్యాసాలు

చైనా సరిహద్దులో ఐటీబీపీ జవాన్లు సేవలందిస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఆధీనంలోని ఐటీబీపీ...జమ్ముకశ్మీర్‌లోని కరకొరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జెకాప్ లా వరకు ఐదు రాష్ట్రాల మీదుగా 3,488 కిలో మీటర్ల దూరం వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ విధులు నిర్వహిస్తోంది. ఐటీబీపీ సరిహద్దు పోస్ట్‌లో 3,000 నుంచి 19,000 అడుగుల ఎత్తుల్లో ఉన్నాయి. 

English Title
At 18K ft and in minus 30 degrees, soldiers raise national flag in Himalayas
Related News