'ఎంత సక్కగున్నావే' ఖాతాలో మరో రికార్డు

Updated By ManamWed, 03/21/2018 - 14:00
Enthasakkagunnave

enthasakkagunnaveరామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ఈ చిత్రంలోని 'ఎంత సక్కగున్నావే' పాట అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

గత నెల ఫిబ్రవరి 13న విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుండగా.. తాజాగా 20మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 20మిలియన్లు సాధించిన పాటల లిస్ట్‌లో ఎంత సక్కగున్నావే చేరిపోయింది. ఇక ఇదే చిత్రంలోని 'రంగమ్మ మంగమ్మ' పాటకు ఇప్పటికే 17మిలయన్ల వ్యూస్‌ను సాధించడం మరో విశేషం.


 

English Title
20 million views for Entha SakkagunnaveRelated News