మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నున్న '2.0'?

Updated By ManamTue, 01/30/2018 - 19:27
2.0

2.0ర‌జ‌నీకాంత్ అభిమానులే కాకుండా భార‌తీయ సినీ ప్రేమికులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం '2.0'. ద‌క్షిణాది అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రం నిర్మాణ వ్య‌వ‌హారాలు పూర్తిచేసుకున్నా.. వి.ఎఫ్‌.ఎక్స్ కార‌ణాల‌తో విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తోంది. తొలుత దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న సినిమా కాస్త‌.. జ‌న‌వ‌రి 26కి వాయిదా ప‌డింది. అక్క‌డితో ఆగ‌కుండా.. ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న చెన్నై క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం మ‌రో మారు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో 2, 3 నెల‌ల త‌రువాతే '2.0' తెర‌పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించిన '2.0'లో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్వ‌రాలు అందించారు.

English Title
'2.0' postponed once again?
Related News