20 ఏళ్ళ 'బావ‌గారూ బాగున్నారా' 

Updated By ManamMon, 04/09/2018 - 15:49
bb

bbమెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ ఉన్నాయి. వాటిలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'బావ‌గారూ బాగున్నారా' ఒక‌టి. 'ప్రేమించుకుందాం రా' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె.నాగ‌బాబు నిర్మించారు. అంత‌కుముందు 'రుద్ర‌వీణ‌', 'త్రినేత్రుడు', 'ముగ్గురు మొన‌గాళ్ళు' వంటి చిత్రాల‌ను నిర్మించినా.. ఈ బ్యాన‌ర్‌లో క‌మ‌ర్షియ‌ల్‌గా సెన్సేష‌న్ సృష్టించిన సినిమా మాత్రం 'బావ‌గారూ బాగున్నారా' అనే చెప్పాలి. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రం కూడా ఇదే కావ‌డం విశేషం. ముఖ్యంగా.. 'ఆంటీ కూతురా', 'సారీ సారీ' పాట‌లు అప్ప‌ట్లో ఒక ఊపు ఊపాయి.

చిరంజీవి, రంభ కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా.. ప్ర‌థ‌మార్థంలో చిరు, రంభ‌, బ్ర‌హ్మానందం మ‌ధ్య సాగే స‌న్నివేశాలు.. ద్వితీయార్థంలో చిరు, కోట‌, శ్రీహ‌రి మ‌ధ్య సాగే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ర‌చ‌న‌, ప‌రేష్‌ రావెల్‌, స‌త్య‌నారాయ‌ణ‌, షావుకారు జాన‌కి, అచ్యుత్ తదిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అందించిన మాట‌లు హైలైట్‌గా నిలిచాయి. 1998 ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం.. నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

English Title
20 years for 'bavagaru bagunnaaraa'
Related News