21 పాయింట్ల ఫార్మాటే ఉత్తమం: శ్రీకాంత్

Updated By ManamWed, 02/21/2018 - 00:35
Shuttler-PV-Sindhu,-athelete-La

Shuttler-PV-Sindhu,-athelete-Laబ్యాడ్మింటన్‌లో 11 పాయింట్ల విధానాన్ని కిదాంబి శ్రీకాంత్ వ్యతిరేకించాడు. 21 పాయింట్ల విధానాన్నే కొనసాగిస్తే బాగుటుందన్నాడు. బ్యాడ్మింటన్‌లో సమూల మార్పులు చేయాలని వరల్డ్ ఫెడరేషన్ ఆలోచిస్తోంది. మూడు గేమ్‌లు, 21 పాయింట్లకు బదులు ఐదు గేమ్‌లు 11 పాయింట్ల విధానాన్ని తీసుకురావాలని బీడబ్ల్యూఎఫ్ భావిస్తోంది. దీనిపై ఈ ఏడాది మే 19న బ్యాంకాక్‌లో జరగనున్న వార్షిక సమావేవంలో బీడబ్ల్యూఎఫ్ ప్రతిపాదన చేస్తుంది. తర్వాత చర్చ, ఓటింగ్ జరిగిన అనంతరం తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. ‘ఏవేవో సంగతులను వింటున్నాను. కానీ అధికారికంగా నాకు ఎలాంటి సమాచారమూ లేదు. 11 పాయింట్ల విధానం గురించి రెండేళ్ల క్రితం నన్ను అడిగారు. 11 పాయింట్ల ఫార్మాట్‌ను నేను ఎన్నడూ ఆడలేదు. 21 పాయింట్ల విధానమే ఉత్తమమని నా అభిప్రాయం. దానినే నేను సమర్థిస్తాను’ అని శ్రీకాంత్ చెప్పాడు. సర్విస్ రూల్‌ను మార్చడంపై కూడా తెలుగు తేజం స్పందించాడు. పొట్టి వాళ్లకంటే పొడుగు వాళ్లకే దీని వల్ల నష్టం ఏర్పడుతుందన్నాడు. ‘ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచి కొత్త సర్వీస్ రూల్ ప్రారంభమవుతుంది. అయితే ఇది ఎక్కువ మందిపై ప్రభావం చూపదు. ఆరడుగులపైగా ఎత్తున్న వాళ్లకే నష్టం జరుగుతుంది’ అని శ్రీకాంత్ అన్నాడు. ఎంతో కీర్తి ప్రతిష్టను సాధించి పెట్టిన 2017లో శ్రీకాంత్ తృటిలో నంబర్ వన్ ర్యాంక్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే అతను ఇప్పటికీ ఆశావహంగా ఉన్నాడు. ‘నేను పూర్తిగా మిస్ కాలేదు. నాకు ఇంకా చాలా అవకాశాలున్నాయి. రాబోయే మూడు నాలుగు నెలల్లో టైటిళ్లు గెలవడం ద్వారా తప్పకుండా నంబర్ వన్ అవుతాను’ అని శ్రీకాంత్ చెప్పాడు. 

English Title
21 point format is better: Srikanth
Related News