డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 25మందికి గాయాలు

Updated By ManamTue, 08/07/2018 - 10:32
accident

accidentజగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప‍్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ వెంటనే సదరు ట్రావెల్స్‌ బస్సును మరో రెండు బస్సులు వెనుకనుంచి ఢీకొట్టాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా, 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మరోవైపు ఘటనపై ఎంపీ కేశినేని నాని ఆరా తీశారు. క్షత గాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను అదేశించారు. తీవ్ర గాయాలైన వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స నిర్వహించాలని నందిగామ డీస్పీ, విజయవాడ, జగ్గయ్యపేట ఆసుపత్రుల సూపెరింటెండలను, అధికారులకు సూచించారు.

English Title
25 injured in Bus Accident
Related News