రాష్ట్రంలో 259 మక్క కొనుగోలు కేంద్రాలు

Updated By ManamMon, 09/24/2018 - 01:03
pocharam srinivas reddy
  • రూ. 1700 మద్దతు ధర కల్పిస్తాం

  • 5లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం

  • వానాకాల పంట ఉత్పత్తుల కొనుగోలుపై పోచారం సమీక్ష 

pocharamహైదరాబాద్: రాష్ట్రంలో మక్కల కొనుగోలుకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, రూ. 1700 మద్దతు ధరతో 5లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్యారా వానాకాలంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల కొనుగోలుపై పొచారం శ్రీనివాస రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ముఖ్యంగా మొక్కజొన్న నూర్పిడులు మొదలైనందున సత్వరమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూచికత్తుపై బ్యాంకుల ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు. మార్కెట్ లో తక్కువ ధర ఉన్నప్పటికి మద్దతు ధర రూ. 1700 ప్రకారమే రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. అదే విధంగా  మినుములు, పెసల కొనుగోలుకు అనుమతివ్వాల్సిందిగా నాఫెడ్‌ను కోరామని, అనుమతి రాగానే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. త్వరలోనే అనుమతి రాగానే మార్క్‌ఫెడ్ ద్వారా మద్ధ్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తామన్నారు.  రైతులు తొందరపడి తక్కువ ధరకు ప్రవేటు వ్యాపారులకు అమ్ముకోని నష్టపోవద్దని మంత్రి రైతులకు విజ్షప్తి చేశారు. రబీలో విత్తనాల కొరత లేకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని మంత్రి పొచారం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జా ఐఎఎస్, మార్క్ ఫెడ్ ఎండి. ఎం.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

English Title
259 sq ft purchases in the state
Related News