త్వరలో 3డి ప్రింటెడ్ ఇల్లు

Updated By ManamMon, 11/05/2018 - 22:50
3d printed house
  • ఏడాదికల్లా భారతదేశంలో సిద్ధం.. ఐఐటీ మద్రాస్‌లో ల్యాబ్ ఏర్పాటు

  • ఇప్పటికే ఇంటి నమూనా తయారు.. రెండు రోజుల్లోనే రెండు అంతస్తులు

  • 3 రోజుల్లో 320 అడుగుల ఇల్లు రెడీ.. భారత మార్కెట్‌కు సాంకేతిక హంగు

  • నిర్మాణ రంగంలో భారీ మార్పులు.. భవిష్యత్తులో మరింత సులభతరం

చెన్నై: సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పాశ్చాత్య దేశాలకు దీటుగా దూసుకెళ్తున్న భారతదేశం.. మరో విషయంలో కూడా ముందడుగు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో ఏడాదికల్లా 3డి ప్రింటెడ్ ఇల్లు సిద్ధైవెుపోతుంది. ఐఐటీ మద్రాస్ బృందం చిన్నపాటి రెండంతస్తుల ఇంటిని కేవలం రెండు రోజుల్లో ప్రింట్ చేసింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధకులు అదే సంస్థ పాత విద్యార్థులు స్థాపించిన స్టార్టప్ కంపెనీతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 3డి ప్రింటింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటుచేశారు. ట్వస్త మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ అనే ఈ కంపెనీ నిర్మాణ రంగాన్ని పూర్తిగా ఆటోమేట్ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే వీరు ప్రింట్ చేసిన మోడల్ ఇల్లు ఈ పరిశోధనలకు ప్రాథమిక మోడల్‌గా పనికొస్తోంది. వీరి పరిశోధనలు సత్ఫలితాలనిస్తే అతి తక్కువ సమయంలో అత్యంత తక్కువ ఖర్చుతో గృహనిర్మాణంపూర్తవుతుంది. దాంతో అందరికీ ఇళ్లు అనే కల కూడా నెరవేరుతుంది. గృహనిర్మాణం, టాయిలెట్లు, రవాణా వ్యవస్థ విషయంలో దేశంలో ఉన్న లోటుపాట్లను గుర్తించిన పరిశోధకులు.. 3డి ప్రింటింగ్ టెక్నాలజీని దీనికి పరిష్కారంగా భావించారు. 
 

image

భారతీయ మార్కెట్లలోకి సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలను తీసుకొస్తామని వారు చెబుతున్నారు. కొత్త పరిజ్ఞానాన్ని నిర్మాణరంగంలోకి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థలతో కూడా తాము సంప్రదింపులు చేస్తున్నామని ఐఐటీ మద్రాస్‌లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోషీ వర్గీస్ తెలిపారు. ట్వస్త సంస్థను ఆదిత్య, పరివర్తన్ రెడ్డి, విద్యాశంకర్, సంతోష్‌కుమార్ అనే ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు కలిసి స్థాపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్లు అనే దాంతోపాటు.. వాటిలోనే టాయిలెట్లను కూడా నిర్మించడం ద్వారా స్వచ్ఛభారత్ అభియాన్‌కు కూడా తోడ్పడతామని ఆదిత్య తెలిపారు.
image

భారత నిర్మాణ పరిశ్రమ అందరికీ అందుబాటులో వచ్చేందుకు 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యేకంగా తయారుచేసి కాంక్రీటును ఉపయోగిస్తున్నారు. ఇది 3డి ప్రింటర్‌లోంచి సులభంగా బయటకు వచ్చేలా చూస్తున్నారు. గట్టిబడిన మట్టి లాంటి సహజైమెన సామగ్రితో పాటు, జియోపాలిమర్స్ లాంటి ప్రత్యామ్నాయ సిమెంటింగ్ సామగ్రిని కూడా భవిష్యత్తులో ఉపయోగిస్తామని బృంద సభ్యులు వివరించారు. ప్రస్తుతం రూపొందించిన నమూనాకు వారికి రెండు రోజుల సమయం పట్టింది. అయితే, మొత్తం ఇంటి స్వరూపాన్ని తీసుకొచ్చి ఫినిషింగ్ కూడా చేయడానికి 320 చదరపు అడుగుల నిర్మాణానికి సుమారు మూడు రోజులు పడుతుందని భావిస్తున్నారు. 

English Title
3d printed house soon
Related News