సంవత్సరానికి 4 కిట్లు

Updated By ManamSat, 08/25/2018 - 07:12
kadiyam
  • బాలికా ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

  • 100 కోట్లతో హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లు: మంత్రి హరీశ్‌రావు వెల్లడి

  • విద్యతోపాటు ఆరోగ్యపరిరక్షణ ముఖ్యమే: మంత్రి జగదీశ్‌రెడ్డి

kadiyamతెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అన్ని పథకాలు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఆడపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న ప్రభుత్వ ఏదైనా ఉందంటే అది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వవేునని చెప్పవచ్చు. ఆడపిల్లల పెళ్లి కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే  విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా బాలికా ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని 7వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదివే 6 లక్షల మంది బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం... బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని ఈరోజు వరంగల్ జిల్లా హసన్ పర్తి గురుకుల పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిల డార్మెట్రీ, అదనపు తరగతి గదులను కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు ఆరోగ్య పరిశుభ్రత కిట్లను అందజేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి విద్యార్థినికి సంవత్సరానికి నాలుగుసార్లు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోలని పిలుపునిచ్చారు.  బాలిక ఆరోగ్య రక్ష కిట్లను రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేటలో శుక్రవారం పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థినులకు దేశంలో మొదటిసారిగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్లు ఇస్తున్నామన్నారు. 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్ల పంపిణీ జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో 28 వేల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజినిక్ కిట్ల పంపిణీ జరుగుతుందని మంత్రి అన్నారు.విద్యార్థినిలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పంపిణీ చేశారు.విద్యార్థినులకు విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ముఖ్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేటలో అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న కిశోర బాలికలకు ఆరోగ్య మరియు శుభ్రత కిట్లను పంపిణీ చేసే బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ప్రారంభించారు. సూర్యా పేట జిల్లాలో 317ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 24,746 మంది విద్యార్థినులకు ఈ కిట్లు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. సంవత్సరానికి నాలుగు సార్లు ఈ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థిని మీద సంవత్సరానికి రూ. 1600లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. పుట్టిన పాప నుంచి ఆమె పెండ్లి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత తీసుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్‌జిల్లాహసన్‌పర్తి గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ కుమార్, తెలంగాణ గురుకుల పాఠశాల విద్యా సంస్థల సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

English Title
4 kits per year
Related News