మెర్కెల్.. నాలుగోసారి!

Updated By ManamWed, 03/14/2018 - 22:50
merkel
  • చాన్సలర్ పదవికి ఎన్నిక

merkelబెర్లిన్ : జర్మనీ చాన్స్‌లర్‌గా నాలుగోసారి ఆంజెలా మర్కెల్ ఎన్నికయ్యారు. పార్లమెంటులోని దిగువ సభలో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 364 ఓట్లు, వ్యతిరేకంగా 315 ఓట్లు వచ్చాయి. తొమ్మిది మంది సభ్యులు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దాంతో వరుసగా నాలుగోసారి జర్మనీకి ఆమె సారథ్యం వహించనున్నారు. ఈ ఎన్నికతో జర్మనీలో గత ఆర్నెళ్లుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడినట్లైంది. వాస్తవానికి మెర్కెల్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్, క్రిస్టియన్ సోషల్ యూనియన్, సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమొక్రాట్లకు పార్లమెంట్‌లో 399 స్థానాలు ఉన్నాయి. మొత్తం స్థానాలు 709. ఈ సంకీర్ణంలో ఏర్పడిన సంక్షోభం వల్ల ప్రభుత్వ ఏర్పాటు దాదాపు 171 రోజులు ఆలస్యమైంది. చివరకు ఓటింగ్ నిర్వహించడంతో మెర్కెల్ చాన్స్‌లర్‌గా ఎంపికయ్యారు.

English Title
4th time merkel
Related News