50 కోట్ల మందికి ‘ఆయుష్షు’

Updated By ManamSun, 09/23/2018 - 23:48
MODI
  • ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం

  • ఆయుష్మాన్ భవకు ప్రధాని శ్రీకారం

  • జార్ఖండ్‌లో లాంఛనంగా ప్రారంభం

  • లబ్ధిదారులకు ఉచితంగా వైద్యం 

modiరాంచీ: ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకమైన ఆరోగ్య సంరక్షణ పథకం.. ఆయు ష్మాన్ భారత్‌ను ప్రధాని నరేంద్రమోదీ మోదీ  ఆది వారం ప్రారంభించారు. రాంచీలో జరిగిన కార్యక్రమం లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుందని అన్నారు. వారందరికీ ఉచితంగా వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ఈ పథకం వల్ల నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద పథకాన్ని అమలు చేయట్లేదని అన్నారు. 10 కోట్ల పేద కుటుంబాలు.. దాదాపు 50 కోట్ల మందికి లబ్ధి  చేకూరుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఈ పథకానికి తుది రూపు ఇచ్చిందని, ఇంతటి ఘన విజయానికి కారణమైన అధి కారులు బృందానికి అభినందనలని ప్రధాని చెప్పారు.  ఈ బృందానికి దేశంలోని 50 కోట్ల మంది పేదల ఆశీర్వాదాలు ఉన్నాయని, ఇకపై ఈ బృందం మరింత పటిష్టంగా పని చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నప్పటికీ, ఈ పథకం వల్ల లబ్ధి పొందడం కోసం ఆసుపత్రికి వెళ్ళవ లసిన అవసరం ఎవరికీ రాకూడదని తాను కోరుకుంటు న్నట్లు తెలిపారు. ఆసుపత్రులు ఖాళీగా ఉండాలని కోరు కుంటున్నానన్నారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరో గ్యం దెబ్బతింటే, ఈ పథకం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేయడం లేదని, ప్రజలందరూ ఆరో గ్యంగా ఉండాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని తెలి పారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఇప్పటికే అమలు చేస్తున్నట్లు తెలి పారు. కాంగ్రెస్ పార్టీ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ, పేదరికాన్ని తరిమేయాలని గతంలో నినాదాలు చేశా రని, అయితే పేదల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని మోదీ చెప్పారు. తప్పుడు హామీలిచ్చి పేదలను ఆకర్షిం చేందుకే ప్రయత్నించిందన్నారు. ఇందులో  బీమా పథ కం వల్ల కలిగే లాభాలను, ఏయే ఆస్పత్రుల్లో ఇది వర్తి స్తుందనే వివరాలను పొందుపరిచినట్లు సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ లేఖల్లో ఆ యా ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుం ది. దీనికి కింద ఎటువంటి సౌకర్యాలు పొందవచ్చు తెలుపుతూ రెండు పేజీల లేఖలు లబ్ధిదారులకు పంపించారు.

English Title
50 crores to 'life'
Related News