రోహిత్ వీర విజృంభణ.. సెంచరీ పూర్తి

Updated By ManamTue, 02/13/2018 - 19:13
rsharma

rohitపోర్ట్‌ ఎలిజిబెత్: టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 10 ఫోర్లు, 4సిక్స్‌లతో రోహిత్ విజృంభించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 107బంతుల్లో రోహిత్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 17వ సెంచరీ. దక్షిణాఫ్రికాపై ఇది రోహిత్ చేసిన రెండో సెంచరీ.  వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా స్టార్ క్రికెటర్ల జాబితాలో రోహిత్ కూడా చేరాడు. సచిన్ టెండూల్కర్(49), విరాట్ కోహ్లీ(34), గంగూలీ(22) సెంచరీలు చేశారు. ఆ తర్వాతి స్థానంలో 15సెంచరీలతో ఇన్నాళ్లూ సెహ్వాగ్ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ 17సెంచరీలు పూర్తి చేసుకుని సెహ్వాగ్‌ను దాటేశాడు.

English Title
5th ODI: rohit sharma complets centuryRelated News