60 ఏళ్ళ 'భూకైలాస్‌'

Updated By ManamTue, 03/20/2018 - 11:41
bhookailas

bhookailasరామాయ‌ణంలో రాముడు క‌థానాయ‌కుడు అయితే.. రావ‌ణాసురుడు ప్ర‌తినాయ‌కుడు. అలాంటి.. రావ‌ణాసురుడికి హీరోయిజాన్ని తీసుకువ‌చ్చిన ఘ‌న‌త మ‌హాన‌టుడు ఎన్టీఆర్‌ది. ఆయ‌న రావ‌ణాసురుడి పాత్ర‌లో న‌టించిన చిత్రం 'భూ కైలాస్‌'. మ‌హా శివ భ‌క్తుడైన రావ‌ణాసురుడి పాత్ర‌లో ఎన్టీఆర్ జీవించేశారిందులో. నార‌ద మ‌హ‌ర్షి పాత్ర‌లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన ఈ సినిమాలో మండోద‌రిగా జ‌మున‌, శివుడిగా నాగ‌భూష‌ణం, పార్వ‌తిగా బి.స‌రోజాదేవి, మాయాసుర‌గా ఎస్వీ రంగారావు న‌టించారు. కె.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఏవీయ‌మ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఆర్‌.సుద‌ర్శ‌న‌మ్‌, ఆర్‌.గోవ‌ర్థ‌న‌మ్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా 'దేవ దేవ ధ‌వ‌ళాచ‌ల' పాట ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట వినిపిస్తూనే ఉంటుంది. మార్చి 20, 1958న విడుద‌లైన ఈ చిత్రం నేటితో 60 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

English Title
60 years for 'bhookailas'
Related News