కువైట్‌లో ఘోరం, ఏడుగురు భారతీయులు దుర్మరణం

Updated By ManamMon, 04/02/2018 - 08:24
Kuwait

Kuwait కువైట్‌లో ఘోరం జరిగింది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం చెందారు. బుర్గాన్ చమురు క్షేత్రం సమీపంలో అల్-అర్టల్ రోడ్డుపై రెండు బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు కువైట్ ఫైర్ సర్వీస్ డైరక్టరేట్(కేఎఫ్‌ఎస్‌డీ) తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 15మంది మరణించారని అధికారులు తెలిపారు. అందులో ఐదుగురు ఈజిప్షియన్లు, ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారని పేర్కొన్నారు. మరికొందరికీ గాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు దగ్గర్లోని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

English Title
7 Indian people killed in fatal Kuwait bus crash
Related News