ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. ఏడుగురు నక్సల్స్ మృతి

Updated By ManamThu, 07/19/2018 - 10:17
naxalites

naxalites దంతెవాడ: చత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ మృతిచెందారు. అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. తిమెనార్ ఫారెస్ట్ ఏరియా నుంచి నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

దంతెవాడ-బీజాపుర్ బోర్డర్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరగగా.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, ఎస్‌టీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. నక్సల్స్ స్థావరాల నుంచి రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు, ఒకటి 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌ఘడ్‌ రాజ‌ధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీట‌ర్ల దూరంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.

English Title
7 Naxalites killed in Chattisgarh
Related News