14 రోజుల్లో 713 కోట్లు

Updated By ManamTue, 08/28/2018 - 22:52
kerala
  • కేరళ వరద బాధితులకు విరాళాలు

  • సీఎం సహాయ నిధికి పంపిన దాతలు

  • కేంద్రం సాయం కంటే 20 శాతం ఎక్కువ

imageతిరువనంతపురం: వందేళ్లలో ఎన్నడూ చూడని భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ముందుకొస్తున్నారు. కేరళ వరద బాధితుల కష్టాలు విని చలించిపోయి తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 28వ తేదీ వరకూ అంటే 14 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు, ఎన్‌ఆర్‌ఐలు.. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎండీఆర్‌ఎఫ్) 713.92 కోట్ల రూపాయను పంపారు. 3 లక్షలా 91 వేల మందికి విరాళాలు పంపారు. కాగా కేంద్ర ప్రభుత్వం సాయం చేసిన మొత్తం కంటే ఇది 20 శాతం ఎక్కువ కావడం విశేషం. కేంద్రం రెండు విడతల్లో కేరళకు 600 కోట్ల సాయం మంజూరు చేసింది. ప్రజలు కొందరు వ్యక్తిగతంగా, మరికొందరు సంయుక్తంగా కేరళ సీఎం సహాయ నిధికి విరాళాలు పంపారు. విరాళాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 713.92 కోట్ల రూపాయలలో బ్యాంకుల ద్వారా 132.62 కోట్లు, ఆన్‌లైన్, పేటీఎం ద్వారా 43 కోట్లు, ఎస్‌బీఐలోని సీఎం సహాయ నిధి ఖాతాకు మరో 500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇక కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రజల నుంచి నగదు, చెక్‌లు, డ్రాఫ్టుల రూపంలో 20 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి.

కేరళకు గూగుల్ 7 కోట్ల సాయం
కేరళకు గూగుల్ భారీ సాయం ప్రకటించింది. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రూ. 7 కోట్లు విరాళమిస్తున్నట్టు గూగుల్ ఇండియా అధికారి వెల్లడించారు. వరద భాదితులను ఆదుకునేందుకు ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారని తెలిపారు. కాగా కేరళ వరదల్లో అపార ఆస్తి, ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. వందలాది మంది మరణించగా, దాదాపు 20 వేల కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా.

కేరళ బాధితులకు 45 వేలు ఇవ్వండి.. అవినీతిపరులకు చండీగఢ్ కోర్టు ఆదేశం
కేరళను ఆదుకునేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, పిల్లలు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ముందుకొస్తుండగా.. చండీగఢ్ కోర్టు కూడా తన వంతుగా సాయపడింది. ఓ అవినీతి కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు తలా 15 వేల రూపాయలు చొప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపాల్సిందిగా పంచకులలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం ఆదేశించింది. కేసు తదుపరి విచారణ అక్టోబరు 1 నాడు ఈ రశీదులును కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సెంట్రల్ ఎక్సైజ్, ఆడిట్ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు అనిల్ కుమార్, అజయ్ సింగ్, రవీందర్ దహియా ఓ కంపెనీ నుంచి లంచం తీసుకుంటుండగా గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఈ కేసును పంచకుల సీబీఐ కోర్టు విచారిస్తోంది. 

కేరళలో రాహుల్ పర్యటన.. పునరావాస శిబిరాల్లో బాధితులకు పరామర్శ
కేరళ వరద ప్రభావ ప్రాంతాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. విదేశీ పర్యటన ముగించుకునిimage సోమవారం నేరుగా తిరువనంతపురం వచ్చిన రాహుల్ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించారు. మంగళవారం అలప్పుజా జిల్లా చెంగనూరులోని సహాయ పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను ఆయన పరామర్శించి, వారి కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరువనంతపురం నుంచి ఆయన హెలీకాప్టర్‌లో చెంగనూరు చేరుకున్నారు. రాహుల్ వెంట కేరళ పీసీసీ అధ్యక్షుడు ఎంఎం హాసన్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు రమేశ్ చెన్నితాల తదితరులు ఉన్నారు. కేరళలోని వరద ప్రభావ ప్రాంతాల్లో రాహుల్ పర్యటించారు. వరద బాధితులు, మత్స్యకారులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాహుల్ సూచించారు. 

నేడు కోచి విమానాశ్రయం పునరుద్దరణ
imageకేరళలో భారీ వర్షా లకు మూత పడిన కోచి విమానాశ్రయం బుధ వారం పునఃప్రారంభం కానుంది. విమానాశ్ర యాన్ని పూర్తిగా తెరుస్తా మని అధికారులు వెల్లడించారు. విమానయాన సంస్థలకు ఈ మేరకు సమాచారం అందించి నట్లు తెలిపారు. చాలా వరకూ విమానయాన సంస్థలు సర్వీసు లను పునరుద్దరించనున్నాయి. దీంతో కేరళ వాసులకు, పర్యా టకులకు చాలా ఊరట కలగనుంది. ఇటీవల భారీ వర్షాలకు వరద ముంచెత్తడంతో విమానాశ్రయాన్ని తాత్కాలి కంగా మూసివేసిన సంగతి తెలిసిందే. దాదాపు 220 కోట్ల మేర నష్టం జరిగింది. 

English Title
713 crores in 14 days
Related News