యోగా చేస్తూ వృద్ధురాలు మృతి

Updated By ManamFri, 06/22/2018 - 16:20
73-Year Old Woman, Yoga Day Celebrations, Dehradun, PM Narendra modi

73-Year Old Woman, Yoga Day Celebrations, Dehradun, PM Narendra modiడెహ్రాడూన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో 73ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన శుక్రవారం డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్ఆర్ఐ)లో చోటుచేసుకుంది. ఎఫ్ఆర్ఐ ప్రాంగణంలో యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా యోగా చేస్తున్న సుధా మిశ్రా (73) అనే వృద్ధురాలు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్పీ ప్రదీప్ రాయ్ చెప్పారు. యోగా వేడుకల సందర్భంగా ప్రాంగణంలో అంబులెన్స్‌లతో పాటు వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారని, దాంతో తక్షణమే సుధా మిశ్రాను ఆస్పత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు.

కానీ, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిశ్రా చనిపోయారని, ఆమె మృతికి గల కారణం వైద్యులు మాత్రమే నిర్ధారించగలరని ఎస్పీ రాయ్ పేర్కొన్నారు. నాల్గో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకుల సందర్భంగా డెహ్రాడూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 50వేల మంది వాలంటీర్లు పాల్గొని మోదీతో పాటు యోగాసనాలు వేశారు.  

English Title
73-Year-Old Woman Dies During Yoga Day Celebrations In Dehradun
Related News