జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు

Updated By ManamTue, 09/11/2018 - 12:49
Jagga Reddy

Jagga Reddyహైదరాబాద్: మానవ అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ కేసులో సోమవారం అర్ధరాత్రి జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డీసీపీ కార్యాలయంలో 3గంటల పాటు ఆయనను విచారించారు. అనంతరం ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాగా కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో జగ్గారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించనున్న పోలీసులు, అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు.

English Title
8 cases filled against Jagga Reddy
Related News