ఆధార్ లీక్‌తో.. ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకం

Updated By ManamWed, 04/18/2018 - 06:12
aadhar
  • ఎన్నికల ఫలితాలపై ప్రభావం.. సమాచార భద్రతకు చర్యలేవి?

  • భద్రతా ప్రమాణాలు తెలపండి.. ఇది మరో ఫేస్‌బుక్ ఉదంతం కాదా

  • నమోదు సంస్థల మాటేమిటి?.. యూఐడీఏఐను నిలదీసిన సుప్రీం

aadharన్యూఢిల్లీ: ఆధార్ సమాచారం లీక్ ఎన్నికల ఫలితాలను ప్రభావితంచేసే ప్రమాదం ఉందని భారత అత్యున్నత న్యాయస్థానం మంగళవారం పేర్కొంది. ఫేస్‌బుక్ డేటా లీక్ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో 1.3 బిలియన్ల భారతీయుల సమాచారం కూడా లీక్ కావడం ఆందోళనకరమని పేర్కొంటూ.. అదే సమయంలో ఆధార్ సమాచారం లీకేజీ వ్యవహారం భారత్‌లో జరిగే ఎన్నికలలో ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ వ్యవహారంపై ఆధార్ నిర్వహణ సంస్థ యూఐడీఏ ఐ స్పందిస్తూ.. ఆధార్ సమాచా రమేమీ అణుబాంబు కాదని వ్యాఖ్యానించడాన్ని కోర్టు తప్పు బట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆధార్ సమాచారం దేశ ఎన్నికల ఫలితాలను తారుమారుచేసే ప్రమాదం పొంచి ఉండడం ఆందోళనకరమని, ఒకవేళ అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించగలదా అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈమేరకు ఆధార్ విశ్వసనీయత, కార్డుదారుల నుంచి సేకరించిన వ్యక్తిగత సమాచారం భద్రత తదితర అంశాలకు సంబంధించి దాఖలైన 27 పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది.

ఫేస్‌బుక్ ఉదంతంతో..
కొంతకాలంగా ఆధార్ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే! ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి కేంబ్రిడ్జి ఎనలిటికా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ఈ వ్యవహారం బట్టబయలు అయ్యాక ఆధార్ వివరాల భద్రతపై సందేహాల తీవ్రత మరింత పెరిగిపోయింది. దీంతోపాటు కేంబ్రిడ్జి ఎనలిటికా సేవలు మీరు ఉపయోగిం చుకున్నారంటే మీరే వాడుకున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపించుకోవడమే! ఈ నేపథ్యంలో ఆధార్ సమాచార భద్రతకు మీరు తీసుకున్న చర్యలేం టని సుప్రీం ధర్మాసనం యూఐడీఏఐని ప్రశ్నించింది. సమస్యలన్నీ ముందుగా తగు హెచ్చరికలతో రావని, అనుకోకుండా ఒకేసారి వచ్చి మీదపడే ప్రమాదం పొంచి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించిన చట్టాన్ని అనుసరించి ఆధార్ వివరాల పరిరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించింది. డాటా లీకేజ్ వ్యవహారాలలో జరుగుతున్న అనర్థాలను తేలిగ్గా తీసుకోలేమని, భవిష్యత్తునూ ప్రభావితం చేయనున్న చట్టాలను రూపొందించే ప్రయత్నం జరుపుతున్నట్లు బెంచ్ పేర్కొంది.

లీక్ సాధ్యం కాదు.. యూఐడీఏఐ
బయోమెట్రిక్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఆధార్ నమోదు సంస్థలు దుర్వినియోగపరిచే ప్రమాదం ఉందికదా అంటూ బెంచ్ సందేహం వ్యక్తంచేసింది. అయితే, ఒకసారి సమాచారం సేకరించాక అంతా ఎన్‌క్రిప్టెడ్ రూపంలోకి మారిపోతుందని, తర్వాత ఆ వివరాలను ఇతరత్రా ఉపయోగించుకోవడం సాధ్యం కాదని యూఐడీఏఐ తెలిపింది. ఈమేరకు యూఐడీఏఐ తరఫున సీనియర్ లాయర్ రాకేష్ ద్వివేదీ ధర్మాసనానికి జవాబిచ్చారు. పిటిషన్‌దారులు ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా స్మార్ట్ కార్డులను సూచించారని ద్వివేదీ కోర్టుకు తెలిపారు. ఆధార్ ప్రాజెక్టు విజయంతం కావడం గూగుల్ లాంటి సంస్థలకు ఆమోదయోగ్యం కాదని.. ఆయా సంస్థలకు అనుకూలంగానే ఈ పిటిషన్లు దాఖలయ్యాయని ద్వివేదీ వివరించారు.

Tags
English Title
Aadhaar Lek .. Democracy is questionable
Related News