ఇన్‌స్టాగ్రమ్‌లో అమీర్ ఖాన్

Updated By ManamWed, 03/14/2018 - 15:25
aamir khan

aamir khanఫ్యాన్స్‌తో తమ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఇప్పుడు సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రమ్‌ను ఎంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ ఇన్‌స్టాగ్రమ్‌లో చేరారు. తొలి పోస్ట్‌గా తన తల్లి జీనత్ హుస్సేన్ ఫోటోను పోస్ట్ చేశారు. అమీర్ ఖాన్ బుధవారం 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. తన జన్మదినం రోజున తల్లికి వందనం చేస్తూ అమీర్ ఖాన్ ఈ ఫోటోను పోస్ట్ చేశారు. అటు ఇందులో డిస్‌ప్లే పిక్‌గా తన లేటెస్ట్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ చిత్రంలోని ఫోటోను ఉంచారు. 

aamir khan

ఇప్పటికే సోషల్ మీడియా వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అమీర్ ఖాన్ యాక్టివ్‌గా ఉన్నారు. వీటిలో అమీర్ ఖాన్‌కు దాదాపు 37 మిల్లియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

English Title
Aamir Khan makes Instagram debut on birthday, posts photograph of mother




Related News