‘అచ్ఛేదిన్’ వచ్చేనా..!

Updated By ManamTue, 02/13/2018 - 23:42
image

imageదేశంలో విద్వేషపూరిత భావాలు పెరిగిన నేపథ్యం లో ఎన్నికలు సమీపిస్తుండడం సంఘ్ పరివార్‌కు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రస్తుతం బీజేపీ, సంఘ్‌పరివార్‌లో కలవరం చెలరేగుతోందనడంలో సందేహం లేదు. గుజరాత్ ఎన్నికలు, రాజస్థాన్‌లో ఉప ఎన్నికల ఫలితాల అనం   తరం బీజేపీలో ఈ కలవరం హెచ్చింది. త్వరలో ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు రానున్నాయి. కాంగ్రెస్ పాలిత కర్ణాటకపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాైలెన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో కూడా ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపైనే సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపాలా వద్దా అనే అంశం లో బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తు తం దేశంలో ప్రజల మనోభావాలను గనిస్తే, 2014లో బీజేపీ సాధించిన 282 స్థానాలు సాధించడం కష్టవేునని, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలంటే మిత్రపక్షాలపై ఆధారపడక తప్పదని సంఘ్ పరివార్ భావిస్తోంది. మోదీని రెండోసారి ప్రధానిగా చేయడానికి మిత్రపక్షాలు అంత సులువుగా అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మోదీపై ఎన్‌డీఏలోని అనేక పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లు మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమతో వ్యవహరించిన తీరుపట్ల సంకీర్ణ భాగస్వామ్యపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నా యి. ఎన్ డీఏలోని చాలా పక్షాలు ఇప్పటికే బహిరంగంగా  అసంతృప్తిని వ్యక్తంచేశాయి. హిందుత్వ భావాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతల వైఖరిని మిత్రపక్షాలు సమర్థించేందుకు వెనకాడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తమ ఆశలపై నీళ్లు జల్లేలా ఉన్నాయని ఆ పక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సంఘ్‌పరివార్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌లో మాత్రం ఎన్నికల ఫలితాలను పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు. తాత్కాలిక ప్రయోజనాలు సమకూర్చే ఎన్నికల ఫలితాలు అంత  పధానం కాదని, దీర్ఘకాల ప్ర యోజనాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ వాదిస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోయినా అది అంత ముఖ్యైవెునది కాదని, సం స్థ ఆశయాలకే  ప్రాముఖ్యం ఇవ్వాలని కొందరు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు వాదిస్తున్నారని తెలిసింది. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకోసం పనిచేస్తుంటే, సంఘ్‌పరివార్ మాత్రం సైద్ధాంతిక ప్రయోజనాలకోసం కృషిచేయాలని పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. తమ ప్రయాణంలో విధానాలను అనుసరించి లక్ష్యాన్ని సాధించడం ప్రభుత్వం ద్వారా సులభమవుతుందని సంఘ్‌పరివార్ అభిప్రాయం. దశాబ్దాలుగా ప్రభుత్వాల్లో సరైన వ్యక్తుల్ని సరైన రీతిలో స్థానం పొం దేటట్లుచేసి లక్ష్యాన్ని చేరుకునేదుకు ఆర్‌ఎస్‌ఎస్ యత్నాలు చేస్తోంది. 2014లో బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన ప్రభుత్వ మాజీ అధికారులను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. నిషేధానికి గురైనా, పార్లమెంట్‌లో బీజేపీ రెం డుస్థానాలకు పరిమితైమెనా ఆర్‌ఎస్‌ఎస్ వెనుకంజ వేయకుండా లక్ష్యసాధనకు కృషిచేస్తూనే ఉన్న అంశాన్ని గుర్తుచేసుకోవాలి. ఏదేైవైునప్పటికీ 2014లో బీజేపీకి లభించిన విజయం సాధారణ విజయం కాదు. గత నాలుగేళ్లలో ప్ర ధాన నియామకాలను తమ గుప్పెట్లోకి తీసుకోవడంలో సఫలమయ్యారు. చరిత్ర పుస్తకాలు, పాఠ్యాంశాలను మార్చేశారు; జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గందరగోళానికి కారణమయ్యారు; ముస్లింలపై దౌర్జన్యాలకు ది గారు. ఇలా ఒక్కటేమిటి దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లో ఒక మహిళా సభ్యురాలు నవ్వినందుకు ఆమెపై మోదీ చేసిన వ్యంగ్య వాఖ్యై పె ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.మహిళలు బీర్ తాగుతున్నారంటూ గోవా ముఖ్యమంత్రి మనోహర్‌పారికర్ వ్యక్తంచేసిన ఆవేదన వికటించింది. తాముచెప్పిన తీరుగానే పత్రికలు రాయాలని, సినిమాలు నిర్మించాలని ఒత్తిళ్లు పెరిగాయి. సంఘ్‌పరివార్‌కు తెలియకుండా గోవులను రవాణా చేస్తున్న వారిపై దాడులు పెరిగాయి.


ఏ విధంగా చూసినా 2019లో సార్వత్రిక ఎన్నికలు గ తంలోలాగా బీజేపీకి నల్లేరుపై నడకకాదని స్పష్టమవుతోంది. బీజేపీలో వృద్ధతరం, మొదటితరం నేతలు నిర్వేదంలో మునిగిపోయారు. ఇందుకు ఎల్‌కే అడ్వాణీ వంటి వారు ఇటీవల చేసిన వ్యాఖ్యలే సాక్ష్యంగా నిలుస్తాయి. మురళీ మ నోహర్ జోషి వంటి వారి ప్రాముఖ్యం తగ్గింది. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్నసిన్హా వంటి వాళ్లు బహిరంగంగానే మోదీ, అమిత్‌షాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజకీయ నేపథ్యం లో తమను వ్యతిరేకించేవారిని మట్టుబెట్టే హత్యా రాజకీయాలు, అసహనాలు పెరిగిపోవడం కలవరపరిచే అంశాలు. గత ఎన్నికల్లో మోదీ వాక్చాతుర్యానికి, ఉపాధి కల్పన ఆశలకు యువతరం మోదీకి అనుకూలంగా ఓటేసింది. ఈసారి పరిస్థితి తారుమాైరెంది. మోదీ వాక్చతు ర్యం పనిచేసే పరిస్థితి లేదు. ఉపాధి కల్పన అనేది ఎండమావిగా తయాైరెంది. దేశంలో జరిగిన వివిధ సర్వేలు బీజేపీకి వ్యతిరేకంగానే వచ్చాయి. ఈసారి ‘అచ్ఛేదిన్’పై ప్రజలకు ఆశలు లేవు. నోట్లరద్దు, జీఎస్‌టీ మిగిల్చిన చేదు అనుభవాలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. ఇన్ని వ్యతిరేకతల మధ్య బీజేపీ ఇంకా దింపుడుకళ్లం ఆశతోనే ఉంది.

 -సిద్దార్థ్ భాటియా 

English Title
is 'Achchidin' coming ..
Related News