'ఛత్రపతి' విలన్ కన్నుమూత

Updated By ManamWed, 03/14/2018 - 11:54
Narendra Jha

Narendra Jha'ఛత్రపతి', 'లెజండ్', 'యమదొంగ' వంటి చిత్రాల్లో నటించి తెలుగువారికి దగ్గరైన ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. బుధవారం ఉదయం 5గంటల సమయంలో వాడలోని తన ఫామ్‌హౌస్‌లో నరేంద్ర తుదిశ్వాసను విడిచారు.

అయితే కొద్ది రోజులుగా గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన షూటింగ్‌లకు విరామం ఇచ్చి ఫాం హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతడికి చికిత్స కూడా జరుగుతుండగా.. బుధవారం కన్నుమూశారు. అయితే బుల్లితెరపై 'బెగుసరై', 'ఏక్ ఘర్ బనౌంగా', 'సూపర్‌కాప్స్ వర్సెస్ సూపర్‌ విలన్స్' వంటి షోలతో అలరించిన నరేంద్ర ఝా.. 'హైదర్', 'కాబిల్', 'రాయిస్', 'ఫోర్స్-2', 'మొహంజోదారో' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చివరగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రేస్-3'లో నటించారు నరేంద్ర ఝా. కాగా ఆయన మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

English Title
Actor Narendra Jha passes away
Related News