పక్కలో పడుకుంటేనే చాన్స్ ఇస్తారంటూ ఏడ్చేసిన శ్రీరెడ్డి

Updated By ManamTue, 03/13/2018 - 19:38
srireddy

srయూట్యూబ్‌లో ఇప్పుడో వీడియో హల్‌చల్ చేస్తోంది. నేను నాన్న అబద్ధం, అరవింద్ సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి ఆ తర్వాత సినిమాల్లో కనిపించడం లేదు. సినిమా అవకాశాలు ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో చాన్స్‌లు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందేనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అమ్మాయిలను వాడుకునే కొందరు పెద్ద హీరోలు కూడా వాళ్ల రాజకీయ లబ్ది కోసం పొలిటీషియన్స్ దగ్గరకు హీరోయిన్లను పంపిస్తారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగమ్మాయిలకు సినిమాల్లో ఆఫర్స్ రావని.. ఒకవేళ వచ్చినా పడుకున్నాకే వస్తాయని.. పడుకున్నా కూడా ఆ ఆఫర్ ఉంటుందో.. ఊడుతుందో తెలియదని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి కన్నీళ్లు పెట్టుకుంది. ‘మా’ అసోషియేషన్‌లో తనకు మెంబర్‌షిప్ కూడా ఇవ్వలేదని ఏడ్చేసింది. సినిమాల్లో నిర్మాతల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ల వరకూ చాలామంది కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె వాపోయింది. 

English Title
Actress Sri Reddy's sensational comments on casting couch
Related News