సింపుల్‌గా హీరోయిన్ స్వాతి వివాహం

Updated By ManamSat, 09/01/2018 - 09:33
Colors Swathi wedding Secrets
Colors Swathi wedding Secrets

హైదరాబాద్ : హీరోయిన్ స్వాతి వివాహం ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్‌గా జరిగిపోయింది. మొదటి నుంచి ప్రేమ, పెళ్లి వార్తలపై గుంభనంగా ఉన్న ఆమె... వివాహ వేడుకను కూడా సీక్రెట్‌గానే ఉంచింది. కేరళకు చెందిన పైలట్ వికాస్‌తో ఆమె వివాహం గురువారం రాత్రి సింపుల్‌గా జరిగింది. కేవలం స్వాతి, వికాస్ కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం కొచ్చిలో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటీనటులకు స్వాతి ఆహ్వానం పంపినట్లు సమాచారం. 

కాగా కలర్స్ ప్రోగ్రాంతో బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకుని... ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన స్వాతి డేంజర్, అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్‌, క‌ల‌వ‌ర‌మాయె మ‌దిలో, స్వామి రారా, కార్తికేయ‌ తదితర  చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించిన స్వాతికి అక్కడ కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు కొన్ని చిత్రాల్లో నటించినా  అవన్నీ ఆమెకు మంచి పేరును సంపాదించిపెట్టాయి. ఎనీ హౌ.... హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్వాతీ...

English Title
Actress swathi ties the knot with pilot Vikas
Related News