ఆదివాసీ పోరాట యోధుడు 

Updated By ManamSat, 09/08/2018 - 01:01
mathanam

imageపీడిత వర్గాల ముద్దుబిడ్డ, ఆదివాసీ హక్కుల పోరాటయోధుడు జవాజీ లక్ష్మీనారాయణ గురువారం తెల్లవారు జాము మూడు గంటలకు మరణించాడు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. గత రెండు సంవత్సరాలుగా తీవ్రైమెనా అనారోగ్యంతో బా ధపడుతూనే అనేక ఆదివాసీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. జవాజీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థా నం పీపుల్స్‌వార్ ఉద్యమం నుంచి ప్రారంభమైంది. అజ్ఞాతంలో దళాలకు దళనేతగా, విప్లవోద్యమం హరిభూషణ్, జంపన్న సహచరుడిగా పనిచేసి ఐదు సంవత్సరాలు పనిచేసి అనారోగ్యం చేత జనారణ్యంలోకి వచ్చాడు. విప్లవ సంఘాలతో సానుభూతిపరుడిగా ఉం టునే సిపిఎస్‌యుటి మారోజు వీరన్నతో కలిసి పని చేశాడు. కులవర్గ నిర్మూలన విప్లవ సాయుధ పోరాట రాజకీయాలనూ ఆకలింపు చేసుకున్నాడు. వర్గపోరాటంతో పాటు కులవర్గ పోరాటాలు నిర్వహించాలని సం దేశం ఇచ్చాడు.

ఆ పరిణామాల క్రమంలోనే ఆదివాసీ హక్కుల పోరాట సమితి స్థాపించడంలో కీలకపాత్ర పో షించాడు. ఏజెన్సీలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడి, పీడన చూసి చలిం చిపోయాడు. ఆదివాసీ ఉద్యమాలైపె, ఆదివాసీ సమాజానికి జరుగుతున్న అన్యాయాలైపె గళమెత్తినాడు. ఆదివాసీ చట్టాలను అమ లు చేయాలని పాలకులపై గళవెుత్తినాడు. పాలకుల చేతి లో ఎన్నో నిర్బంధాలకు గురై రాజ్యహింసలో రాటుదేలినాడు. తనకు ఉన్న అపారమైన జ్ఞానంతో అనతి కాలం లోనే తుడుందెబ్బ రాష్ట్ర జిల్లా నాయకునిగా ఎదిగాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జన్మించినా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఆదివాసీ ప్రాంతాలనూ కలియ తిరిగాడు. ఆదివాసీ హక్కు ల పోరాట సమితి తుడుం దెబ్బ ఉద్యమంలో 20 సంవత్సరాలు ఏకధాటిగా పనిచేశాడు. జవాజీ లక్ష్మీనారాయణ కుటుంబం చిన్నప్పటి నుంచి పేదరికం, అప్పుల ఊబిలోనే పెరిగాడు. ఎన్ని నిర్బం ధాలు ఎదుైరెనా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా చివ రి వరకు బూర్జువా పార్టీల్లో చేరకుండా నైతిక విలువలకు, ఆదివాసీ ఉద్యమాలకు కట్టుబడి జీవించాడు. పోలీసులు ఎన్నో కేసులు బనాయించినా కూ డా బెదరకుండా ఆదివాసీ హక్కుల కోసం పనిచేశాడు. 

ఆదివాసీ అస్థిత్వ ఉద్యమాలో సీనియర్ నాయకుడిగా జూనియర్‌లనూ ఉద్యమ నిర్మాణాల గురించి వివరిస్తుండేవాడు. జవాజీ లక్ష్మీనారాయణ మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటు. నడుస్తున్న స్వయంపాలన ఉద్యమంలోనే ఆదివాసీ సమాజానికి దూరం అయ్యా డు. ఆదివాసీ సమాజానికి ఎనలేని సేవలు అందిం చాడు. గుండాల మండలంలో గిరిజన గిరిజనేతర పం చాయితీలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలనూ సమానంగా చూసేవాడు.
ఆదివాసీ అరణ్యంలో విరబూసి అస్తమించిన జవా జీ లక్ష్మీనారాయణకు ఆదివాసీ రచయితల సంఘం సం పూర్ణంగా జోహర్లు అర్పిస్తున్నది. లక్ష్మీనారాయణ ఆశ య సాధనకు ఆదివాసీలు ఉద్యమించినప్పుడే ఆయ న ఆత్మకు సంపూర్ణంగా శాంతి చేకూరుతుంది.

- వూకె రామకృష్ణ దొర
ఆదివాసీ రచయితల సంఘం
9866073866

Tags
English Title
Adivasi fighting warrior
Related News