మళ్లీ తుపాకీ మోత

Updated By ManamWed, 03/21/2018 - 01:58
image
  • అమెరికా స్కూల్లో గాయపడ్డ ఇద్దరు విద్యార్థులు

  • దుండగ విద్యార్థిపై సెక్యూరిటీ ఆఫీసర్ కాల్పులు

  • వాస్తవ పరిస్థితిపై ఇంకా అందని పూర్తి సమాచారం 


imageన్యూయార్క్: అమెరికాలో నెల వ్యవధిలోనే మరోసారి తుపా కీ మోత మోగింది. మేరీలాండ్‌లోగల సెయిం ట్ మేరీ కౌంటీలోని ‘గ్రేట్ మిల్స్ హైస్కూల్’లో మంగ ళవారం ఒక విద్యార్థి సహచరులపై కాల్పులకు పాల్ప డగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పాఠశాల అధి కారులు ధ్రువీకరించారు. ఈ దారుణాన్ని నిలువరిం చేందుకు సెక్యూరిటీ ఆఫీసర్ అతడిపై కాల్పులు జరపడంతో దుండగ విద్యార్థి గాయప డ్డాడని కౌంటీ షెరీఫ్ టిమోతీ కేమరన్ తెలిపారు. విద్యార్థి కాల్పులకు పాల్పడటానికి దారితీసిన కారణాలేమిటో తెలియరాలేదన్నారు. ఈ సంఘ టనతో ఆ ప్రాంగ ణాన్ని పోలీసులు దిగ్బంధించిన కారణంగా ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం ఇంకా అందలేదు. విద్యార్థులందరూ తలుపులు బి గించుకుని తరగతి గదుల్లో బిక్కుబిక్కుమం టున్నారని మాత్రమే వార్తలందాయి. గతనెల 14న ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో కాల్పుల ఫలితంగా టీచర్లు, విద్యార్థులు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో తుపాకీ నియంత్రణపై దేశవ్యా ప్తంగా చర్చ రేగిన నేపథ్యంలో తాజా కాల్పులు చో టు చేసుకోవడం గమనార్హం. కాగా, ఈ సంఘ టనలో ఎందరు చనిపోయి ఉంటారన్న దానిపై స మాచారం లేదని షెరీఫ్ తెలిపినట్లు ఏబీసీ న్యూస్ చానల్ ఉటంకించింది. అయితే, పరిస్థితి అదుపు లోనే ఉందని, పిల్లల తల్లిదండ్రులు స్కూలు ప్రాం తానికి వెళ్లవద్దని పోలీ సులు అప్రమత్తం చేశారు. మరోవైపు ‘ఆల్కహాల్, పొగాకు, తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణ సంస్థ’ పరిశోధక బృందం రంగంలో దిగినట్లు ఏబీసీ చానెల్ పేర్కొంది. కాగా, తామంతా సహ విద్యార్థు లతో కలసి తరగతి గదుల్లో దాగి ఉన్నట్లు జొనాథన్ ఫ్రీస్ అనే విద్యార్థి సీఎన్‌ఎన్ చానెల్‌తో ఫోన్‌ద్వారా సంభాషిస్తూ తెలిపాడు. అయితే, తమకు కాల్పుల మోత వినిపించలేదని అతడు పేర్కొన్నాడు. ఇక పాఠశాలలో కా ల్పుల సంఘటనపై విచారణను స్వయంగా పర్య వేక్షిస్తున్నట్లు మేరీలాండ్ గవర్నర్ లారీ హోగాన్   తెలిపారు. విద్యార్థుతు, సమాచారమిచ్చినవారి భద్ర త కోసం తాము ప్రార్థిస్తున్నామని తెలిపారు.

English Title
Again gun fire
Related News