మరోసారి స్పెషల్‌గా...

Updated By ManamSun, 05/27/2018 - 22:13
kajal

imageఎన్టీఆర్‌కు కాజల్ లక్కీ గర్ల్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరి కలిసి నటించిన బృందావనం, బాద్‌షా, టెంపర్ చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిచాయి. హీరోయిన్‌గానే కాకుండా ఈ పంజాబీ గుడియా ఎన్టీఆర్ కోసం ‘జనతాగ్యారేజ్’లో పక్కా లోకల్ అంటూ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. మరోసారి ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ వినపడుతుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత..’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరో యిన్స్‌గా నటిస్తున్నారు. అయినా కూడా త్రివిక్రమ్ ఓ స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేశారట. అందులో కాజల్ ఆడిపాడ నుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. 

English Title
again in special
Related News