'అజ్ఞాత‌వాసి' ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamTue, 02/13/2018 - 20:21
agnyathavaasi

agnyathavaasiప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 25వ చిత్రం 'అజ్ఞాత‌వాసి'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య‌.. సంక్రాంతికి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన ఈ సినిమాకి సంబంధించిన‌ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్..  ట్రేడ్ స‌ర్కిల్స్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ ప్ర‌కారం ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.40.9 కోట్ల షేర్‌ను.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.57.5 కోట్ల షేర్‌ను 'అజ్ఞాత‌వాసి' రాబ‌ట్టుకుందని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌రల్డ్‌వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.125 కోట్లు ఉన్న ఈ మూవీ కేవ‌లం 46 శాత‌మే రిక‌వ‌రీ అయ్యింది. భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో ఈ చిత్రం నిలిచింద‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 'బాంబే వెల్వెట్‌', 'స్పైడ‌ర్' చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

English Title
'agnyathavaasi' final collections
Related News