త‌ల్లి హోస్టెస్‌..కూతురు పైలెట్‌!

Updated By ManamWed, 08/01/2018 - 14:22
Pooja Chinchankar
 air hostess

ముంబై : పూజా చిన్‌చంక‌ర్ ఉద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎయిరిండియాతో 38 ఏళ్ల అనుబంధం ఆమెది. ఎయిర్ హోస్టెస్‌గా ముంబై- బెంగ‌ళూరు ఫ్ల‌యిట్లో ఆమె చివ‌రి ప్ర‌యాణం. ఇంకా...ఆ ఫ్ల‌యిట్ పైలెట్ ఎవ‌రో కాదు. ఆమె కూతురు ఆశ్రిత‌నే.  రిటైర్మెంట్ రోజున ఆశ్రిత ఆ ఫ్ల‌యిట్‌ పైలెట్‌గా ఉండాల‌న్న‌ ఆమె కోరిక కూడా తీరడమే ఆమె ఉద్విగ్న‌త‌కు అస‌లైన కార‌ణం..!

బుధవారం విమానంలో ఆశ్రిత ఈ విష‌యం ప్ర‌క‌టించ‌గానే సిబ్బందితోపాటు అందులోని ప్ర‌యాణికులు త‌ల్లి, కూతురుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. కొందరు ప్రేమ‌గా హ‌త్తుకున్నారు. ఆశ్రిత త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో ఉంచిన ఈ పోస్టింగ్‌కు విప‌రీత‌మైన స్పంద‌న ల‌భించింది. త‌ల్లి ఆశ‌య సాధ‌న కోసం ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చిందంటూ అంద‌రూ ఆశ్రితకు అభినంద‌న‌లు తెలిపారు. త‌ల్లి, కూతురు ఒకే ఫ్ల‌యిట్‌లో ఉండ‌టం కాక‌తాళీయంగానే జ‌రిగింద‌ని ఎయిరిండియా ప్ర‌క‌టించింది. పూజా అందించిన సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.

English Title
Air India pilot flies mom on last trip as air hostess
Related News