ఎయిర్ ఇండియా విక్రయానికి సుముఖమే

Updated By ManamThu, 06/21/2018 - 06:17
air india

imageన్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా బుధవారం చెప్పారు. ఎయిర్ ఇండియా బోర్డు అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తోందని చెప్పారు. ఈ జాతీయ విమానయాన సంస్థలో ప్రతిపాదిత వ్యూహాత్మక వాటా విక్రయం గత నెలలో బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలైమెన తర్వాత పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం కట్టుబడే ఉందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి అయిన సిన్హా తెలిపారు. అయితే, 76 శాతం వాటా విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతానికి ముగిసినట్లేనని కూడా ఆయన చెప్పారు.

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాను విక్రయించి, బడ్జెట్ విమానయాన విభాగం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో  పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంది. అలాగే, సింగపూర్‌కు చెందిన శాట్స్‌తో కలసి సంయుక్త రంగంలో ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం వాటా విక్రయించవలసి ఉంది. అయితే, ఎయిర్ ఇండియాలో మెజారిటీ వాటాను విక్రయించే పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి విరమించుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. నష్టాలతో నడుస్తున్న విమానయాన సంస్థను ప్రైవేటీకరించడానికి ఇది (ఎన్నికల ఏడాది) సరైన సమయం కాకపోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

English Title
Air India is willing to sell
Related News