అలగ్జాండ్రియా అద్వితీయ విజ్ఞానసేవ!

Updated By ManamSun, 03/11/2018 - 02:31
Alexandria

aelbakyanధనాన్ని దోచుకోవచ్చు; ఆస్తుల్ని దోచుకోవచ్చు; కానీ విద్యను మాత్రం ఎవరూ దోచుకోలేరు. ఆస్తులు శత్రువులను తెచ్చిపెడితే, విద్య మిత్రులను సంపాదించి పెడుతుంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జనకు కేవలం ఇంటర్‌నెట్, వాట్స్‌అప్‌ల మీదే ఆధారపడుతున్నారు. అలా కేవలం వాటిపైనే కాకుండా వారికి తమ విద్యాసంస్థల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా వారిని నడిపిస్తే అపార జ్ఞానసంపద వారి సొంతమవుతుంది. ఇందుకు వారికి ఆయా విద్యాసంస్థల సహకారం కూడా అవసరం. శాస్త్రీయ దృక్పథంతో కూడిన అధ్యయనం మేధోసంపత్తిని పెంచుతుంది. నూతన జ్ఞాన ఆవిష్కరణలు జరగాలంటే విజ్ఞాన సముద్రంలో ఈ దవలసిందే! మనకంటే ముందుతరం జ్ఞానవంతుల భుజాలపై మనం ఉన్నాం. వారు మనకు అందిం చిన జ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలకు ముందడుగువేస్తే భవిష్యత్ తరాల వారికి మన ద్వారా మరింత విజ్ఞానం అందించగలం. అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. మనం నేర్చుకునే, అధ్యయనం చేసే విజ్ఞానమంతా కొంతమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయివుంది. ఎన్నో శాస్త్రీయ సంబంధమైన అధ్యయునాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఉంది బ్రిటన్‌కు చెందిన రీడ్ ఎల్సెవీర్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు రూపొందించిన అథ్యయనాలను తన ఆ ధీనంలో ఉంచుకుని వాటికి తానే యజమానిలా వ్యవహరిస్తోంది. గతంలో భారత్‌ను బానిసత్వ పాలనలో ముంచెత్తడానికి కారణమైన ఈస్ట్ ఇండియా కంపెనీలా ఈ ఎల్సెవీర్ కంపెనీ కూడా ప్రపంచ శాస్త్రవేత్తల కృషిఫలితంగా సముపార్జించిన అధ్యయునాలతో వ్యాపారం చేస్తూ 2016లో 6,895 బిలియన్ల (అక్షరాలా 62,000 కోట్ల రూపాయులు) జీబీపీని సంపాదించింది. శాస్త్రీయ అధ్యయనాల ప్రచురణల ద్వారా చేసిన వ్యాపారంలో 39 శాతం లాభాలార్జిం చింది.

  ఈ కంపెనీ శాస్త్రీయ రంగంలోనే కాకుండా ఆ రోగ్య, సాంస్కృతిక రంగాల్లో అధ్యయనాలను కూడా సేకరిస్తుంది. లాభాపేక్షలేని సంస్థ క్రాస్‌రెఫ్ అంచనాల ప్రకారం, ప్రస్తుతం 94,841,081 మేధో పరిష్కృత అధ్యయనాలు అందుబాటులో ఉన్నాయి. అమెరికన్ మెడికల్ అసోసియేుషన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ వంటి మొత్తం సుమారు 56,726 జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. మేధో సంపత్తి విజ్ఞాన అధ్యయనాలు సంపాదించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నాయి. ఉదాహరణకు ఒక్కొక్క పేపర్ విలువ 1,941 రూపాయల (30 అవెురికన్ డాలర్లు) ఉంటుంది. ఇంత ధరపెట్టి సంపాదించినా వాటి వినియోగానికి పరిమితులుం టాయి. 2011లో కజికిస్థాన్‌కు చెందిన అలెగ్జాండ్రా ఎల్‌బక్యాన్ అనే డిగ్రీ విద్యార్థిని తనకు అవసరమైన ముఖ్య అధ్యయనాలను సంపాదించలేకపోయింది. దాంతో తీవ్ర నిరాశ చెందిన ఆమె, ఎస్‌సీఐ-హబ్ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 67 మిలియన్ల జర్నల్ ఆర్టికల్స్‌ను సేకరించింది. ఈ వెబ్ సైట్ ద్వారా సేకరించిన అధ్యయనాలన్నీ కానీ ఖర్చులేకుండా అవసరమైనవారు వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ వెబ్‌సైట్‌ను భారతీయులు ఎక్కువగా వినియోగించుకుంటారు. 13,143,462 మంది విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ను తరచుగా ఉపయోగించుకుంటారు. బ్రెజిల్, ఇరాన్, ఇండోనేసియా, రష్యాకు చెందినవారు కూడా తరచూ ఈ వెబ్‌సైట్‌ను వినియోగించుకుం టున్నారు. విజ్ఞాన సంబంధమైన అధ్యయునాల పై తమకు సంపూర్ణ కాపీరైట్లున్నాయంటూ పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు తమ లాయుర్లను తీసుకుని అలెగ్జాండ్రా ఎల్‌బక్యాన్‌ను సంప్రదించాయి. అవెురికా కోర్టుల్లో ఆమెపై ఎన్నో మిలియన్ డాలర్లకు కేసులు వేసి, కోర్టుల నుంచి నష్టపరిహారం ఉత్తర్వులతో ఎల్‌బక్యాన్ కోసం వెతకడం మొదలెట్టాయి. అప్పటికే ఆమె అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు అయినప్పటికీ వెబ్‌సైట్ కార్యకలాపాలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయా న్నిఎలా ఆపలేమో విజ్ఞానాన్ని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు ఫలించవు. 
తాడేపల్లి శివరావుకృష్ణారావు

Tags
English Title
Alexandria's unique knowledge service!
Related News