'అలా చేస్తేనే అన్ని సీట్లు గెలవగలం' 

Updated By ManamThu, 07/12/2018 - 20:29
All seats win, booth level committees, Lokesh babu

All seats win, booth level committees, Lokesh babuఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బూత్ లెవల్ కమిటీలు పటిష్టంగా ఉంటేనే అన్ని స్థానాలనూ గెలుచుకోవడం సులభంగా మారుతుందని ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి బూత్‌ స్థాయిలో పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 1500 రోజుల సందర్భంగా గురువారం అమరావతిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతిబూత్‌ పరిధిలో అదనంగా 10 ఓట్లను ప్రభావితం చేయగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమేనన్నారు. ఐదు వేల ఓట్లతో గెలిచే అసెంబ్లీ సెగ్మెంట్లే ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. పార్టీ తరఫున ప్రతి వంద మందికి ఒకరు చొప్పున సేవా మిత్రను మంత్రి లోకేశ్ నియమిస్తామని చెప్పారు.  

English Title
All seats will win if we study booth level committees, says Lokesh babu
Related News