ధర్మపోరాట సభకు పూర్తైన ఏర్పాట్లు

Updated By ManamMon, 04/30/2018 - 08:02
Sabha
Dharma Porata Sabha

తిరుపతి: ఏపీకి మోదీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ధర్మపోరాట సభ జరగనుంది. ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరగనున్న ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ సభలో టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలలందరూ పాల్గొననున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం నుంచి ఈ సభకు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న రాజీలేని పోరాటాన్ని ప్రజలకు తెలియజేయడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా పక్కన పెట్టారన్నది ఈ సభలో చంద్రబాబు వివరించనున్నారు. 

English Title
All set for Dharma Porata Sabha
Related News