బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌

Updated By ManamMon, 08/27/2018 - 09:51
Chandrababu

Chandrababuముంబై: రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో సోమవారం లిస్టింగ్ చేశారు. ఈ ఉదయం 9.15 గంటలకు గంట కొట్టి బాండ్ల లిస్టింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, ఏపీ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వారిలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, టీసీఎస్‌ సీఈవో చంద్రశేఖరన్‌, మంగళం బిర్లా సహా తదితరులు ఉన్నారు. 

English Title
Amaravati Bonds listed in BSE
Related News