బొటానికల్ గార్డెన్స్ హత్య కేసులో అమర్‌ అరెస్ట్

Updated By ManamWed, 02/14/2018 - 09:23
Amar Kanth

Amarkanth హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిన బొటానికల్ గార్డెన్ హత్య కేసులో నిందితుడు అమర్‌కాంత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పింకీని చంపడంతో పాటు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన అమర్.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. తల్లి మమత ఆదేశంతో అతడు పింకీని కిరాతకంగా చంపేయగా..  ఆ తరువాత ఆమె శరీరాన్ని మార్బుల్ కట్టర్‌తో కట్ చేసి సంచిలో వేసుకొని బొటానికల్ గార్డెన్స్ దగ్గర పడేశాడు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రధాన నిందితుడు వికాస్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

English Title
Amarkanth arrest in Botanical Gardens murder Case
Related News