ఉప్పునీటితో అద్భుతమైన ప్రయోజనాలు!

Updated By ManamTue, 02/13/2018 - 16:16
Salt Water Gargle, Amazing Health Benefits

Salt Water Gargle, Amazing Health Benefitsసాధారణంగా ఉప్పు ఒక యాంటిబయాటిక్ అని అందరికి తెలుసు. అయితే ఆ ఉప్పుతో రుచిగా ఆహారం తయారుచేసుకోవడమే కాదు.. అద్భుతమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చనని తెలుసా?. మిమ్మల్ని తరచూ గొంతునొప్పి, జలుబు, సైనస్ వంటి ఇన్ఫెక్షన్లు బాధిస్తున్నాయా?.. వాతావరణంలో మార్పుల కారణంగా ఉత్పన్నమయ్యే అలర్జీలతో బాధపడుతున్నారా?. అయితే ఆ అద్భుతమైన చిట్కా మీకోసమే. అదే ఉప్పునీళ్లు. చక్కగా ఇంట్లోనే తక్కువ సమయంలో తయారుచేసుకునే ఈ చిట్కాను పాటించి అలర్జీ, బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్ఫెక్షన్ల వల్లే ఉత్పన్నమయ్యే నోటి, గొంతు ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అనారోగ్య సమస్యలు, అలర్జీలు బాధించినప్పుడు గోరువెచ్చని నీళ్లకు ఉప్పును చేర్చాలి. ఆ మిశ్రమాన్ని నోటిలో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయండి చాలు. ఎంతో ఉపశమనం కలుగుతుంది. సులభమైన ఈ చిట్కాను ఎలా తయారుచేసుకోవచ్చో చూద్దాం.. 

తయారీ విధానం..
టీస్పూన్ సగానికి ఉప్పు తీసుకోవాలి. నీళ్లను కాచి చల్లార్చాలి. కాచిన నీళ్లు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి 8 ఔన్స్‌ల నీటికి టీస్పూన్‌లో సగం ఉప్పు మిశ్రమాన్ని కలపాలి. 

ఇలా చేయండి.. 
కాచిన నీళ్లు, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని సాధ్యమైనంత మేర గొంతులోపలికి పోసుకొని గట్టిగా పుక్కిలించి ఉమ్మివేయాలి. ఆ తరువాత మరికొంచెం ఉప్పునీళ్లను నోటిలోకి తీసుకుని పళ్ల చుట్టూ శుభ్రమయ్యేలా ఝళిపించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని ఉమ్మివేయడంగానీ, మింగడం గానీ మీ వీలును బట్టి చేయెచ్చు. ఇన్ఫెక్షన్లు సోకిన సమయంలో పుక్కిలించిన ఉప్పునీటిని ఉమ్మివేయడం మంచిది. అలర్జీలు తొందరగా తగ్గిపోవాలన్నా తొందరలో ఆ ద్రావణాన్ని అతిగా మింగడం వల్ల డిహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. కాల్షియం లోపం, అధిక రక్త పోటుకు దారితీయవచ్చు. రోజుకు రెండుసార్లు ఉప్పునీటిని పుక్కిలించాలి. లేదంటే ఎన్నిసార్లైన ఇలా చేయవచ్చు. 

ఉప్పునీటితో అలర్జీలకు చెక్..
గొంతునొప్పి: జలుబు, జ్వరం సమయంలో గొంతు నొప్పితో తీవ్రంగా బాధపడేవారికి ఉప్పునీటి ద్రావణం అద్భుతంగా పనిచేస్తుంది. ఉప్పునీటిని పుక్కిలించడం ద్వారా తేలికగా ఉపశమనం పొందొచ్చు. 

అలర్జీలు: జలులు, జ్వరం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా అలర్జీ సంబంధిత ఇన్ఫెక్షన్లను కూడా ఉప్పునీరు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది.  

సైనస్-శ్వాసకోస సమస్యలు: వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా సమర్ధవంతంగా ఉప్పునీరు నియంత్రిస్తుంది. 2013 అధ్యయనం ప్రకారం.. వైద్య నివారణ పద్ధతుల్లో జ్వరాన్ని తగ్గించడంలో ఉప్పునీటితో పుక్కిలించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయని, మళ్లీ ఏ ఇతర ఇన్ఫెక్షన్లు తిరిగి సోకకుండా నియంత్రించగల శక్తి దీనిలో ఉంది.

నోటి అల్సర్లు: నోటి అల్సర్లనుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఉప్పునీటితో పుక్కలించడమనేది వంటంటి చిట్కాలో ఇదొకటి. అల్సర్ల బాధ నుంచి త్వరితంగా ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.

దంతాల ఆరోగ్యం: దంతాల ఆరోగ్యంలో కూడా ఉప్పునీళ్లు బేషుగ్గా పనిచేస్తాయి. దంతాల చిగుళ్ల రక్షణకు ఎంతోగాను ఉపయోగపడుతుంది. అలాగే చిగుళ్ల వాపు, కావిటీస్‌లను నియంత్రణలో ఉంచుతుంది. నోటి లాలాజలంలోని దాగిన బ్యాక్టీరియాను కూడా క్షీణించేలా చేస్తుంది. 

English Title
The Amazing Health Benefits Of Doing Salt Water Gargle
Related News