త్వరలోనే అమెజాన్ గ్రేట్ సేల్ సీజన్- 2

Updated By ManamThu, 10/18/2018 - 12:15
Amazon

Amazonకొన్ని రోజుల క్రితమే గ్రాండ్ సక్సెస్‌తో గ్రేట్ ఇండియన్ సేల్‌ను ముగించిన అమెజాన్.. మరోసారి భారీ ఆఫర్లతో రానుంది. అక్టోబర్ 24నుంచి రెండో రౌండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్నట్లు అమెజాన్ ప్రకటించింది. 24 అర్ధరాత్రి ప్రారంభం కానున్న ఈ సేల్ 28అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.

ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, హోమ్ అప్లియెన్సెస్, కన్య్జూమర్ ఎలక్ర్టానిక్స్ వంటి వాటిపై ఆపర్లు ఉండనున్నాయి. ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 10శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇక బజార్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను కూడా అమెజాన్ ఇవ్వనుంది. అలాగే అలెక్స్ ఆధారిత డివైజ్‌లకు 70శాతం డిస్కౌంట్.. బెస్ట్ సెల్లింగ్ బుక్స్ కేవలం రూ.19కే వంటి మంచి ఆఫర్లు ఉండనునన్నాయి.

English Title
Amazon Great India Sale second season starts soon
Related News