దేశ రాజకీయాల్లో ‘ఫేస్‌బుక్’ ప్రకంపనలు

Updated By ManamWed, 03/21/2018 - 16:04
facebook

facebookఫేస్‌బుక్ డేటా స్కాం భారత రాజకీయాలనూ కుదిపేస్తోంది. ఫేస్‌బుక్ డేటా‌ను కాంగ్రెస్ పార్టీ అడ్డదార్లో వాడుకుంటోందన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో స్పందించారు. డేటాను చోరీ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందగలరా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్రొఫైల్‌తో కేంబ్రిడ్జ్ అనలిటికాకున్న పాత్ర ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేస్‌బుక్ ఖాతాదారుల డేటాను రాజకీయ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నట్లు ఆరోపణలు రావడంతో రవిశంకర్ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. 

సోషల్ మీడియా ద్వారా దేశ ఎన్నికల ప్రక్రియను అడ్డదారుల్లో ప్రభావితం చేయాలని చూస్తే సహించేది లేదంటూ ఫేస్‌బుక్‌కు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో సోషల్ మీడియాలో మేదస్సును స్వతంత్రంగా ఇతరులతో మంచుకోవడానికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని చెప్పారు.  

Tags
English Title
Amid Facebook Probe, Government Says Will Take ''Strong Action If Need Be''
Related News