రాహుల్ బాబా లెక్కపెట్టడం వచ్చా?

Updated By ManamSat, 08/04/2018 - 17:12
Amit Shah
  • సోనియా, రాహుల్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా

amit shah

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ... యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. శనివారం రాజస్థాన్‌లోని రాజ్‌సమద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇటాలియన్ భాష రాదు. ఒకవేళ ఆ భాష వచ్చి ఉంటే రాహుల్ గాంధీకి ఆ భాషలోనే జవాబు చెప్పి ఉండేవాడిని. రాహుల్ బాబా మీకు లెక్కించడం వస్తే లెక్కపెట్టండి, నాకు ఇటాలియన్ రాదు, లేకుంటే ప్రజలకు మేం ఎంత చేశామో మీకు ఇటాలియన్‌లోనే చెప్పి ఉండేవాడిని’ అని నిప్పులు చెరిగారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజస్థాన్ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం 116 పథకాలను అమలు చేస్తోందని అమిష్ షా అన్నారు.

కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అక్కడ  రాజస్థాన్ గౌరవ యాత్రను ప్రారంభించింది. 58 రోజుల పాటు కొనసాగనున్న  ఈ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. 

English Title
Amit Shah attacks Rahul baba, says would have told you in Italian
Related News